క్రీడలు

MS Dhoni: రిటైర్మెంట్‌‌పై ధోనీ.. హింట్‌ ఇచ్చినట్లేనా?

tv9telugu
Advertisement
728x90 Banner Ad
MS Dhoni: రిటైర్మెంట్‌‌పై ధోనీ.. హింట్‌ ఇచ్చినట్లేనా?

చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎం.ఎస్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఆయన వచ్చే సీజన్‌లోనూ ఆడాలని సీఎస్‌కే మాజీ స్టార్ సురేష్ రైనా ఆకాంక్షించాడు. చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమి తర్వాత ‘స్టార్ స్పోర్ట్స్‌’తో రైనా మాట్లాడాడు. ఈ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్‌పై వారిద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణను పంచుకున్నాడు. తాను ధోనీతో మాట్లాడానని, ఐపీఎల్ 2026 సీజన్‌కు ధోనీ కేవలం మిస్డ్‌కాల్ మాత్రమే ఇచ్చారని, ఇది లెక్కలోకి రాదని, వచ్చే ఏడాది కచ్చితంగా ఆడాల్సిందేనని తాను ధోనీతో అన్నానని రైనా వెల్లడించాడు. దానికి ధోనీ స్పందిస్తూ.. తన శరీరం కొంచెం బలహీనంగా అనిపిస్తోందని తెలిపినట్టు రైనా వివరించాడు. అయితే, తాము అవేమీ నమ్మబోమని, ధోనీ వచ్చే ఏడాది ఆడాల్సిందేనని తాను స్పష్టం చేశానని రైనా వెల్లడించాడు. ఇది ధోనీ వ్యక్తిగత నిర్ణయమైనప్పటికీ అతను మాత్రం పాజిటివ్‌గానే ఉన్నట్లు తనకు అనిపించిందని తెలిపాడు. ధోనీ ఈ సీజన్‌ మొత్తం తుది జట్టులో లేడు. కనీసం స్టేడియంలో కూడా కనిపించలేదు. కానీ సోమవారం అతణ్ని చెపాక్‌లో చూసి ఫ్యాన్స్‌ భావోద్వేగానికి గురయ్యారు. టీమ్ ఫొటోగ్రాఫ్ కోసం మైదానంలోకి రాగానే స్టేడియం దద్దరిల్లింది. ఎలాంటి స్పీచ్‌ ఇవ్వకుండానే, బౌండరీ లైన్ వెంట నడుస్తూ అభిమానులకు అభివాదం చేశాడు. 44 ఏళ్ల ధోనీ చెపాక్ హోమ్ గ్రౌండ్‌లో కనిపించడం ఇదే చివరిసారి కావచ్చనే బాధతో ఫ్యాన్స్ భావోద్వేగంతో నినాదాలు చేశారు. మరోవైపు రైనాతో ధోనీ వ్యాఖ్యలు, చెపాక్‌లో కనిపించి అభివాదం చేయడం ఆయన రిటైర్మెంట్‌ హింట్ అయ్యుండొచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Jayam Ravi: భార్య VS లవర్‌! దెబ్బకు పిచ్చోడిలా తయారైన స్టార్ హీరో 20లక్షల కోసం.. హీరోయిన్‌ను చంపేసిన భర్త? పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది.. Peddi: అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా.. నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్

Advertisement
468x60 Banner Ad
Published on Thursday, May 21, 2026
← Back to News
MS Dhoni: రిటైర్మెంట్‌‌పై ధోనీ.. హింట్‌ ఇచ్చినట్లేనా? | Telugu Live24