క్రీడలు

Rishabh Pant: మా ఓనర్ నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా..!

tv9telugu
Advertisement
728x90 Banner Ad
Rishabh Pant: మా ఓనర్ నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా..!

Rishabh Pant Comments: ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసి 221 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్థాన్ ముందుంచింది. ఇన్నింగ్స్ ఆరంభంలో లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మొదటి 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు బోర్డుపై 130 కి పైగా పరుగులు చేరిపోయాయి. అయితే, ఆ తర్వాత రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ వేసిన చివరి ఓవర్లు లక్నో పరుగుల వేగానికి బ్రేకులు వేశాయి. దీంతో జట్టు ఆశించిన దానికంటే తక్కువ పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. మ్యాచ్‌ను మార్చేసింది..! రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 93 పరుగులు చేసి లక్నో బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పేసిన ఈ యువ ఆటగాడిపై రిషబ్ పంత్ ప్రశంసలు కురిపించాడు. “వైభవ్ సూర్యవంశీ లాంటి అసాధారణమైన ఫామ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజులో ఉన్నప్పుడు ఎంత పెద్ద స్కోరునైనా కాపాడుకోవడం బౌలర్లకు చాలా కష్టమైన పని” అని పంత్ ఒప్పుకున్నాడు. ఇది కూడా చదవండి: వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే.. ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..! ఫీల్డింగ్ తప్పిదాలే కొంపముంచాయి: పంత్ ఆవేదన.. లక్ష్య ఛేదనలో బౌలర్లను మాత్రమే తప్పుబట్టలేమని, మైదానంలో చేసిన ఫీల్డింగ్ తప్పిదాలే తమ ఓటమిని శాసించాయని పంత్ పేర్కొన్నాడు. కీలక సమయాల్లో క్యాచ్‌లు చేజార్చడం, రనౌట్ అవకాశాలను వదిలేసుకోవడం వల్ల చేతిలో ఉన్న మ్యాచ్ చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో లక్నో జట్టుకు ఏదీ కలిసిరాలేదని, వచ్చే సీజన్ ప్రణాళికల గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుందని అన్నాడు. ఇది కూడా చదవండి: ఎవర్రా మీరంతా.. మీరు, మీ ఆట తగలెయ్యా.. ఏరికోరి తెస్తే.. ఫ్రాంచైజీలకే వెన్నుపోటు పోడిచిన నలుగురు.. పంత్ కెప్టెన్సీ, భవిష్యత్తుపై ప్రశ్నలు? ఈ ఓటమితో లక్నో పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రిషబ్ పంత్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతనికి చెల్లిస్తున్న 27 కోట్ల రూపాయల భారీ మొత్తానికి న్యాయం జరగడం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీమిండియా సెలెక్టర్లు సైతం టెస్ట్ వైస్ కెప్టెన్సీ నుంచి పంత్‌ను తొలగించి కేఎల్ రాహుల్‌కు బాధ్యతలు అప్పగించడం, వన్డే జట్టులో చోటు కల్పించకపోవడం అతని కెరీర్‌పై ఒత్తిడిని పెంచుతోంది. రాబోయే 2027 ఐపీఎల్ వేలంలో లక్నో యాజమాన్యం పంత్‌ను వదులుకుని, ట్రేడింగ్ ద్వారా వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: IPL 2026: ఇదేందిది.. ప్లేఆఫ్స్‌కు చెన్నై టీం.. టాప్ 4 కోసం పెద్ద ప్లాన్ చేశారుగా..! సమిష్టి వైఫల్యం, ఫీల్డింగ్ లోపాలు, ప్రత్యర్థి జట్టులో వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఆటగాడి అద్భుతమైన ఇన్నింగ్స్ లక్నో విజయానికి అడ్డుకట్ట వేశాయి. రిషబ్ పంత్ తన ఫామ్‌ను, కెప్టెన్సీ శైలిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Advertisement
468x60 Banner Ad
Published on Thursday, May 21, 2026
← Back to News
Rishabh Pant: మా ఓనర్ నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా..! | Telugu Live24