క్రీడలు

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి టీమిండియా లైన్ క్లియర్.. కానీ ఒక్క కండిషన్

tv9telugu
Advertisement
728x90 Banner Ad
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి టీమిండియా లైన్ క్లియర్.. కానీ ఒక్క కండిషన్

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ తరపున మెరుపులు మెరిపిస్తున్న 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత సీనియర్ జట్టులో చోటు దక్కడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అతను టీమిండియా జెర్సీ వేసుకోవాలంటే మాత్రం ఒక ముఖ్యమైన విభాగంలో తక్షణమే మెరుగుపడాల్సి ఉంటుందని టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ స్పష్టం చేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోవడానికి సూర్యవంశీ చేసిన ఫీల్డింగ్ తప్పిదాలే ప్రధాన కారణమని కైఫ్ ఎత్తిచూపాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 193/8 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లేలో చెలరేగిపోయి కేవలం 21 బంతుల్లోనే 46 పరుగులు జోడించి జట్టుకు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. మాధవ్ తివారీ వేసిన స్లోయర్ బాల్‌కు అవుట్ అయ్యేంతవరకు ఢిల్లీ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. అయితే, లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాటర్ సాహిల్ పరాఖ్ ఇచ్చిన ఒక సులువైన క్యాచ్‌ను సూర్యవంశీ చేజార్చాడు. ఆ తర్వాత కొన్ని మిస్‌ఫీల్డింగ్‌ల వల్ల కీలకమైన పరుగులు ప్రత్యర్థి ఖాతాలోకి వెళ్లడంతో రాజస్థాన్ 193 పరుగులను కాపాడుకోలేక ఓటమిపాలైంది. సూర్యవంశీ ఫీల్డింగ్ లోపాలను విశ్లేషిస్తూ జియోహాట్‌స్టార్ ఛాంపియన్స్ వాలీ కామెంట్రీలో మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. “ఐపీఎల్ ఫ్రాంచైజీల స్కౌట్స్ ఆటగాళ్లను ఎంపిక చేసేటప్పుడు బ్యాటింగ్‌తో పాటు ఖచ్చితంగా ఫీల్డింగ్ టెస్ట్ కూడా పెట్టాలి. సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్ టాలెంట్ ఉన్న ఆటగాడే, కానీ ఈ ఐపీఎల్‌లో అతను ఒక్క క్యాచ్ కూడా సరిగ్గా పట్టుకోగా నేను చూడలేదు. ఢిల్లీ మ్యాచ్‌లో బంతి అతని వైపు సరైన హైట్‌లోనే వచ్చింది. దానికి అంతగా గాల్లోకి ఎగరాల్సిన అవసరమే లేదు, నడుము ఎత్తులో ఈజీగా పట్టుకోవచ్చు. కానీ అతను అనవసరంగా జంప్ చేసి క్యాచ్ వదిలేశాడు. సూర్యవంశీ ఇండియాకు ఆడాలంటే ముందు ఈ ఫీల్డింగ్ పరీక్షలో పాస్ అవ్వాలి” అని కైఫ్ కఠినమైన సలహా ఇచ్చాడు. మరోవైపు సూర్యవంశీ బ్యాటింగ్ శైలిని టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆకాశానికెత్తాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను మొదటి బంతి నుంచే సిక్సర్లు కొట్టడం మామూలు విషయం కాదన్నాడు. “నేను నా కెరీర్‌లో క్రిస్ గేల్ లాంటి ఎందరో భయంకరమైన హిట్టర్లను అవుట్ చేశాను. కానీ సూర్యవంశీ బ్యాట్ ఫ్లో వేరే లెవెల్‌లో ఉంది. క్రీజులో నిలబడి బౌలర్లపై అతను చూపిస్తున్న ఆధిపత్యం నన్ను ఆశ్చర్యపరిచింది. నేను కనుక అతనికి బౌలింగ్ చేయాల్సి వస్తే.. ఎలాగైనా సరే బంతిని స్పిన్ చేస్తూ అతని హిట్టింగ్ ఆర్క్ కి దూరంగా వేయడానికే ప్రయత్నిస్తాను” అని భజ్జీ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్‌లో ఇంతటి అద్భుతమైన నైపుణ్యం ఉంది కాబట్టే.. ఫీల్డింగ్‌ను కూడా మెరుగుపరుచుకుంటే సూర్యవంశీ తిరుగులేని ఆల్‌రౌండ్ ప్యాకేజీగా మారతాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Advertisement
468x60 Banner Ad
Published on Thursday, May 21, 2026
← Back to News
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి టీమిండియా లైన్ క్లియర్.. కానీ ఒక్క కండిషన్ | Telugu Live24