క్రీడలు

ప్రయోగాలంటూ ఆ నలుగురికి షాకిచ్చిన బీసీసీఐ.. మరి ఆ ఇద్దరి ఎంపికలో అసలు మతలబు ఏంటి?

tv9telugu
Advertisement
728x90 Banner Ad
ప్రయోగాలంటూ ఆ నలుగురికి షాకిచ్చిన బీసీసీఐ.. మరి ఆ ఇద్దరి ఎంపికలో అసలు మతలబు ఏంటి?

IND vs AFG ODI Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం రాత్రి జట్టును ప్రకటించింది. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్న ఈ జట్టు ఎంపిక ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా కొత్త ప్రయోగాలకు తెరలేపామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెబుతున్నప్పటికీ, కొందరు ఆటగాళ్ల పట్ల అనుసరించిన వైఖరి చూస్తుంటే సెలెక్షన్ కమిటీలో అంతర్గత రాజకీయం నడుస్తోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఫామ్‌లో ఉన్న సీనియర్లను, దేశీవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఆటగాళ్లను కాదని కొందరిని పక్కనబెట్టడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి వంద శాతం అర్హత ఉన్న ఆ నలుగురు క్రికెటర్ల పరిస్థితి ఇప్పుడు అభిమానులను సైతం కలచివేస్తోంది. అక్షర్ పటేల్‌పై వేటు.. కొత్త ప్రయోగాల వెనుక ఆంతర్యమేమిటి..? భారత జట్టు నమ్మకమైన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఈ సిరీస్ నుంచి అకస్మాత్తుగా తప్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతని స్థానంలో విదర్భ తరపున దేశీవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న హర్ష్ దూబేకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. హర్ష్ దూబే ఇప్పటివరకు 30 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 31 వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో రెండు అర్ధసెంచరీలతో 296 పరుగులు చేశాడు. అతని రికార్డు బాగానే ఉన్నప్పటికీ, అనుభవజ్ఞుడైన అక్షర్‌ను తప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది మింగుడుపడటం లేదు. రాబోయే ప్రపంచకప్ కోసం ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగార్కర్ సమర్థించుకుంటున్నా, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న అక్షర్‌ను ఇలా పక్కనబెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: ఎవర్రా మీరంతా.. మీరు, మీ ఆట తగలెయ్యా.. ఏరికోరి తెస్తే.. ఫ్రాంచైజీలకే వెన్నుపోటు పోడిచిన నలుగురు.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై మళ్లీ నిర్లక్ష్యం.. ఇటీవలి కాలంలో అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి సైతం ఈ వన్డే జట్టులో చోటు దక్కలేదు. భారత్ తరపున ఆడిన గత 4 ఇన్నింగ్స్‌ల్లోనే 10 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన ఈ స్పిన్నర్‌ను గాయాలు, ఫామ్ నెపంతో దూరం పెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న లీగ్ మ్యాచ్‌ల్లోనూ వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ, సెలెక్టర్లు అతని ప్రతిభను గుర్తించకపోవడం వెనుక బలమైన శక్తులు పనిచేశాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పర్పుల్ క్యాప్ వీరుడు భువనేశ్వర్ కుమార్‌కు ఘోర అన్యాయం.. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో సంచలన బౌలింగ్‌తో పర్పుల్ క్యాప్‌ను తనవద్దే ఉంచుకున్న సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 24 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్‌గా దూసుకుపోతున్న భువీని పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి తిరిగి తీసుకుంటారని అందరూ భావించారు. స్వింగ్ బౌలింగ్‌తో పవర్‌ప్లేలో వికెట్లు తీయగల సమర్థుడైన భువనేశ్వర్‌ను వైట్ బాల్ క్రికెట్ నుంచి పూర్తిగా దూరం పెట్టాలనే సెలెక్టర్ల మొండి వైఖరి నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇది కూడా చదవండి: వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే.. ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..! పరుగుల యంత్రం రజత్ పాటిదార్‌ను తొక్కేస్తున్నారా? మిడిల్ ఓవర్లలో దంచి కొట్టే బ్యాటర్ రజత్ పాటిదార్‌ను కూడా సెలెక్టర్లు పూర్తిగా విస్మరించారు. దేశీవాళీ క్రికెట్‌లో 67 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 4 శతకాలు, 13 అర్ధశతకాలతో 2,278 పరుగులు చేసిన ఘనమైన రికార్డు పాటిదార్ సొంతం. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లలోనూ తన బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. ఇంతకంటే ఒక బ్యాటర్ జట్టులోకి రావడానికి ఇంకేం నిరూపించుకోవాలో సెలెక్టర్లకే తెలియాలి. స్థిరమైన ఫామ్‌లో ఉన్న ఇలాంటి ఆటగాడిని పక్కనబెట్టడం వెనుక సెలెక్షన్ పాలిటిక్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శకులు మండిపడుతున్నారు. ఇది కూడా చదవండి: IPL 2026: ఇదేందిది.. ప్లేఆఫ్స్‌కు చెన్నై టీం.. టాప్ 4 కోసం పెద్ద ప్లాన్ చేశారుగా..! భవిష్యత్తు అవసరాల పేరుతో ప్రతిభ గల ఆటగాళ్లను బలిపశువులను చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌లో ఈ నలుగురు ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ఉంటే వారి కెరీర్‌కు ఎంతో ప్లస్ అయ్యేది. ఇప్పటికైనా సెలెక్షన్ కమిటీ ఇలాంటి పక్షపాత ధోరణులను వీడి, ఆటగాళ్ల ఫామ్‌ను, అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే భారత క్రికెట్‌కు మేలు జరుగుతుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Advertisement
468x60 Banner Ad
Published on Thursday, May 21, 2026
← Back to News
ప్రయోగాలంటూ ఆ నలుగురికి షాకిచ్చిన బీసీసీఐ.. మరి ఆ ఇద్దరి ఎంపికలో అసలు మతలబు ఏంటి? | Telugu Live24